
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పోటీలో లేవు. అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ లాంచి సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. దీంతో ఈ వారంలో వీకెండ్లో పరదా మూవీ కోసం మాత్రమే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో తమిళ చిత్రం సార్ మేడమ్, బాలీవుడ్ మూవీ మా, మారీషన్ లాంటి డబ్బింగ్ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫ్రైడే ఒక్క రోజులోనే దాదాపు 16 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
అమెజాన్ ప్రైమ్
సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22
నెట్‌ఫ్లిక్స్
అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22
ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22
లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22
మా (హిందీ సినిమా) - ఆగస్టు 22
మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22
ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22
బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23
జియో హాట్‌స్టార్
ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22
పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22
జీ5
ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22
ఆపిల్ ప్లస్ టీవీ
ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22
ఆహా
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22
సన్ నెక్ట్స్
కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) - ఆగస్టు 22
కోలాహాలం(మలయాళ సినిమా)- ఆగస్టు 22
లయన్స్ గేట్ ప్లే
ఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22