
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్- 2025 వేడుక లాస్ ఏంజిల్స్(యూఎస్)లోని పికాక్ థియేటర్‌లో జరిగింది. తాజాగా జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల వేడుకలో రెండు రికార్డ్స్ నమోదు అయ్యాయి. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 27 నామినేషన్లతో అత్యధిక అవార్డులకు ఎంపికైన డ్రామా సిరీస్ "సెవెరెన్స్" ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీలో నటించిన టిల్‌మాన్ అత్యుత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డ్ అందుకున్న తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.
ఉత్తమ డ్రామా సీరిస్‌గా "ది పిట్" ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నోహ్ వైల్ 26 సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మీని గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ హిట్ సీరిస్‌గా గుర్తింపు పొందిన "అడోలెసెన్స్"లో నటించిన ఓవెన్ కూపర్‌కు ఉత్తమ సహాయనటుడిగా అవార్డ్ దక్కింది. ఎమ్మీ అవార్డ్ అందుకున్న అత్యంత పిన్న వయసు ఉన్న వ్యక్తిగా ఓవెన్ కూపర్ (15) రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఉత్తమ డ్రామా సిరీస్- ది పిట్ (HBO Max)
ఉత్తమ నటుడు- నోహ్ వైల్ (ది పిట్)
ఉత్తమ నటి - బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
ఉత్తమ సహాయనటుడు - ట్రామెల్ టిల్మాన్ (సెవెరెన్స్)
ఉత్తమ కామెడీ సిరీస్- ది స్టూడియో
ఉత్తమ లిమిటెడ్ సిరీస్- అడోలెసెన్స్ (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ సహాయనటుడు లిమిటెడ్ సిరీస్- ఓవెన్ కూపర్ (అడోలెసెన్స్)
ఉత్తమ డాక్యుమెంట్రీ సిరీస్- 100 ఫుట్ వేవ్
ఉత్తమ యానిమేషన్- ఆర్కేన్ లీగ్ ఆర్ లెజెండ్స్ (నెట్‌ఫ్లిక్స్)