
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా ఈ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ హాలీడేస్లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపు చూస్తున్నారు. ఫ్రైడే రోజున బకాసుర రెస్టారెంట్, సు ఫ్రమ్ సో అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చే వాటిలో తెలుగు వెబ్ సిరీస్లతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్ అలరించేందుకు మీ ముందుకొస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం కుటుంబంతో కలిసి ఇంట్లోనే మీకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఈ లిస్ట్ చదివేయండి.
నెట్ఫ్లిక్స్..
ఓహో ఎంతన్ బేబీ(తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆగస్టు 08
స్టోలెన్-హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 08
మ్యారీ మీ- (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 10
ది ఆక్యుపెంట్-(హాలీవుడ్) ఆగస్టు 09
అమెజాన్ ప్రైమ్
అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08
జియో హాట్స్టార్..
సలకార్(హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 08
సోనీలివ్
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ-సీజన్-4(అమెరికన్ సిరీస్)- ఆగస్టు 08
జీ5
మామన్(తమిళ సినిమా)- ఆగస్టు 08
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08
సన్ నెక్ట్స్..
హెబ్బులి కట్(కన్నడ సినిమా)- ఆగస్టు 08
లయన్స్ గేట్ ప్లే
ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 08
ఎమ్ఎక్స్ ప్లేయర్
బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 08
సైనా ప్లే
నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08