
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.