
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 'డిటెక్టివ్ ఉజ్వలన్'.. ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మిస్టరీ కామెడీ జానర్లో దర్శకులు ఇంద్రనీల్ గోపికృష్ణన్, రాహుల్ సంయుక్తంగా తెరకెక్కించారు. సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 23న విడుదలైన ఈ చిత్రం రూ. 4.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ చిత్రం మలయాళంలో రూ. 10 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టింది.

డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan) చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఎలాంటి నేరాలు జరగనటువంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ ఉంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది. గ్రామ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న ఉజ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా కనిపెడితాడు..? అతన్ని పట్టించేందుకు పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు..? ఆ సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు ఏంటి..? వంటి అంశాలు ఈ చిత్రంలో ఆసక్తిగా తెరకెక్కించారు.