
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేశాయి. దీంతో సినీ ప్రియులు కొత్త మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికొస్తే అనుష్క శెట్టి ఘాటి, శివ కార్తికేయన్ మదరాసితో పాటు లిటిల్ హార్ట్స్ లాంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో అనుష్క ఘాటిపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక వీటి సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటీటీలకు సినిమాలు క్యూ కడుతుంటాయి. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కన్నప్ప ఓటీటీలో సందడి చేస్తుండగా.. మాలిక్, ఇన్‌స్పెక్టర్ జెండే లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఇన్‌స్పెక్టర్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05
క్వీన్ మాంటిస్-(కొరియన్ మూవీ)- సెప్టెంబరు 05
లవ్ కాన్ రివేంజ్-(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 05
డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్(యానిమేషన్ చిత్రం)- సెప్టెంబరు 05
జియో హాట్‌స్టార్
సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం)- సెప్టెంబర్ 05(రూమర్ డేట్)
ఎన్‌సీఐఎస్-టోని అండ్ జీవా(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05
ఏ మైన్‌క్రాఫ్ట్ -(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05
ది పేపర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05
అమెజాన్ ప్రైమ్
మాలిక్- (హిందీ మూవీ)- సెప్టెంబర్ 05
డిష్ ఇట్ అవుట్-(ఒరిజినల్ సిరీస్)-సెప్టెంబర్ 05
సన్ నెక్స్ట్
ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05
జీ5
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05
కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05
ఆపిల్ ప్లస్ టీవీ
హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05
ఎమ్ఎక్స్ ప్లేయర్
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06
లయన్స్ గేట్ ప్లే
లాక్‌డ్- (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05