
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్‌చరణ్. ఈ చిత్రం తర్వాత ఆయనకి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రామ్‌చరణ్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ సంస్థ ఆరు నెలలుగా రామ్‌చరణ్ డాక్యుమెంటరీ పైన వర్క్ చేస్తోందని టాక్.
ఈ హీరో కెరీర్, ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం, సాధించిన అవార్డులు... వంటి వాటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా నెటఫ్లిక్స్ సంస్థ డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ నయనతారలపై డాక్యుమెంటరీ ఫిల్మ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక రామ్‌చరణ్ తాజా సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.