
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్‌స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్‌గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్‌రాజ్ అనే స్విమ్‌సూట్ కిల్లర్‌గా కనిపించనున్నాడు.
ఓటీటీలో
బాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్‌పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్‌బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్‌గా నటించి మెప్పించాడు.