
ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్ చిత్రాల జాబితాలో ఉన్న నాలుగు సినిమాల్లో 'జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓదెల2 నేడు (మే8) ఓటీటీలోకి రాగా.. రాబిన్‌హుడ్ సినిమా మాత్రం మరో 24 గంటల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. దీంతో ఈ సమ్మర్‌లో ఇంట్లోనే కూర్చొని సందడి చేయవచ్చు. వీటిలో కొన్ని థియేటర్ వద్ద ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’- మే8
కోలీవుడ్ హీరో అజిత్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ వర్షన్‌లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. అజిత్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ (రూ. 250 కోట్లు)సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ (NetFlix) వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చిన సమయం నుంచి ఆయన ఫ్యాన్స్ ఎదురుచూశారు. అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో 'జాక్'- మే8
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘జాక్’ (Jack). ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిల్చింది. అయితే, ఓటీటీలో చూడొచ్చని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా ఆయన ప్లాన్ చేశాడు కానీ, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మే 8న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఓదెల 2’- మే8
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన ల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల 2’ (Odela 2).. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టలేదు. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. అయితే, మరో దర్శకుడు సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌కు కథ అందించారు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో నేడు (మే8 ) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

జీ5లో 'రాబిన్‌హుడ్'- మే 10
నితిన్- శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‌హుడ్' మరో 24గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ‘జీ 5’ (Zee 5) సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్‌లో ప్రసారం కానుంది. అదే సమయంలో జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఈ సంస్థ ఇదే స్ట్రాటజీని అనుసరించిన విషయం తెలిసిందే. నితిన్‌తో భీష్మ చిత్రం ద్వారా హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ డిజాస్ట్‌ర్‌గా నిలిచింది.