ఉద్యోగం చేసే చాలామంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో సతమతమైపోతుంటారు. కానీ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ మాత్రం 30 ఏళ్లుగా రొటీన్ విధానం పాటిస్తూ.. ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా.. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పనికి ఆపేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వారంలో ఒకరోజు పని మానేసి.. సన్నిహితులతో కాలం గడపడం, సినిమాలు చూడటం, నచ్చిన ఫుడ్ బయటే తినేయడం వంటివి చేస్తానని వెల్లడించారు. ఈ సమయంలో ఎంతటి ముఖ్యమైన కాల్స్, మీటింగ్స్ కూడా పెట్టుకోనని పేర్కొన్నారు. దీనిని 30 సంవత్సరాలుగా పాటిస్తూనే ఉన్నానని మార్క్ రాండోల్ఫ్ చెప్పారు.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుందని మార్క్ చెబుతారు. పని ముఖ్యమే అయినప్పటికీ.. మనకోసం, కుటుంబం కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవాలి. ఎంతోమంది దిగ్గజ సీఈఓలు వర్క్ లైఫ్ బిజీగా ఉన్న సమయంలో మార్క్ రాండోల్ఫ్ మాటలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
నిజానికి ఈ ట్వీట్ ఏప్రిల్ 7న చేసినప్పటికీ.. ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది. కొంతమంది మార్క్ రాండోల్ఫ్ మాటలతో ఏకీభవించినప్పటికీ.. కొందరు సీఈఓలు మాత్రమే కొట్టిపారేస్తున్నారు. సక్సెస్ సాధించాలంటే ఎక్కువ గంటలు పని చేయాల్సిందే అని చెబుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా?


