
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్.. నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది)
సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు. తాజాగా రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.
Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥
Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025