'స్క్విడ్‌ గేమ్‌ 3' హైస్పీడ్‌లో ఫైనల్‌ గేమ్‌ (ట్రైలర్‌) | Squid Game Season 3 Final Games Trailer | Sakshi
Sakshi News home page

'స్క్విడ్‌ గేమ్‌ 3' హైస్పీడ్‌లో ఫైనల్‌ గేమ్‌ (ట్రైలర్‌)

Jun 14 2025 1:30 PM | Updated on Jun 14 2025 1:49 PM

Squid Game Season 3 Final Games Trailer

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన  కొరియన్‌ థ్రిల్లర్‌  వెబ్‌ సిరీస్‌ స్క్విడ్‌గేమ్‌ (Squid Game) నుంచి ఫైనల్‌ సీజన్‌ వచ్చేస్తుంది. 'స్క్విడ్‌ గేమ్‌ 3' ఫైనల్‌ గేమ్‌ పేరుతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. హ్యాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్‌లు మంచి విజయాన్ని అందుకున్నాయి. జూన్‌ 27 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఫైనల్‌ గేమ్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు టీమ్‌ తెలిపింది. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషలలో విడుదల అవుతుంది.

ఈ సిరీస్‌ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్‌లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్‌ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్‌లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్‌ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్‌ 456 ఓసారి గేమ్‌లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు.

ఫస్ట్‌ సీజన్‌లో రెడ్‌ లైట్‌- గ్రీన్‌ లైట్‌ అని గేమ్‌ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్‌ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్‌ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్‌ గేమ్‌ చివరి సీజన్‌ చూసేయాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement