చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల సందడి కూడా దాదాపు ముగిసిపోయింది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రావడం లేదు. ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ వీకెండ్ కోసం సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.
ఈ ఫ్రైడే థియేటర్లలో సినిమాలు రాకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం శోభిత ధూళిపాల చీకటిలో, హెబ్బా పటేల్ మరియో.. టాలీవుడ్ ఆడియన్స్‌కు స్పెషల్‌గా అనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మస్తీ-4, గుస్తాక్ ఇష్క్, కన్నడ నుంచి 45 లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23
తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23
ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23
అమెజాన్ ప్రైమ్
చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23
గుస్తాక్ ఇష్క్(హిందీ సినిమా)- జనవరి 23
ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
జియో హాట్‌స్టార్
మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23
స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23
ఆహా
మరియో(తెలుగు సినిమా)- జనవరి 23
జీ5
45 (కన్నడ సినిమా) - జనవరి 23
మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23
సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23
కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23
సన్ నెక్ట్స్..
షెషిప్పు(మలయాళ సినిమా)- జనవరి 23
ముబీ
లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23


