రానా నాయుడు 2 ట్రైలర్‌ వచ్చేసింది | Rana Naidu Season 2 Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

రానా నాయుడు 2 ట్రైలర్‌ వచ్చేసింది

Jun 3 2025 12:29 PM | Updated on Jun 3 2025 12:40 PM

Rana Naidu Season 2 Official Trailer Out Now

రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో వెంకటేష్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ "రే డోనోవన్" (Ray Donovan) ఆధారంగా రూపొందించబడింది. గతేడాదిలో విడుదలైన రానా నాయుడు సిరీస్‌కు సీక్వెల్‌గా దీనిని రూపొందించారు. పార్ట్‌ 1కు మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల కానుంది. నాగా నాయుడి పాత్రలో వెంకటేష్‌ చాలా అద్భుతంగా మెప్పించాడు. తన కుటుంబం కోసం ఎంత వరకైనా వెళ్లే పవర్‌ఫుల్‌ వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. అయితే, పార్ట్‌ 1లో కాస్త బోల్డ్‌ కంటెంట్‌ ఉందని విమర్శలు రావడంతో సీక్వెల్‌ దానిని కాస్త తగ్గించారు. ప్రస్తుతం ట్రైలర్‌ కట్‌లో కూడా అలాంటి సీన్స్‌ లేవు. 
 

Advertisement
 
Advertisement
Advertisement