40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి! | Aap Jaisa Koi madhavan Movie review and ott streaming details | Sakshi
Sakshi News home page

40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!

Nov 9 2025 7:19 AM | Updated on Nov 9 2025 7:20 AM

Aap Jaisa Koi madhavan Movie review and ott streaming details

టైటిల్: ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi)

నటులు: ఆర్‌.మాధవన్, ఫాతిమా సనా షేక్‌ (దంగల్ నటి)

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. తమకు నచ్చిన కంటెంట్‌ను చూసే వీలు దొరికింది. దీంతో భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్‌ తెగ చూసేస్తున్నారు. ప్రజెంట్‌ ఆడియన్స్‌ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్‌కు తగ్గ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. అలా ప్రస్తుత రోజుల్లో 42 ఏళ్లయినా పెళ్లికానీ ఓ సంప్రదాయ యువకుడి కథే ఈ ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi). ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.

కథేంటంటే..
సంప్రదాయ కుటుంబానికి చెందిన 42 ఏళ్ల శ్రీరేణు(ఆర్‌ మాధవన్). అతని పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎన్నో ఏ‍ళ్లుగా సంబంధాలు చూస్తూనే ఉంటారు. శ్రీ పెళ్లి వేడుక కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూసేవారు. అసలు అతనికి పెళ్లి యోగం ఉందో లేదో అని జ్యోతిష్యులను అడిగేవారు. కానీ అవన్నీ వర్కవుట్ కాకపోవడంతో శ్రీరేణు మానసికంగా ఇబ్బందులు పడేవాడు.

అలా ఇబ్బందులు పడుతున్న శ్రీకి అతని ఫ్రెండ్‌ ఓ సలహా ఇస్తాడు? అతని సలహా విన్న శ్రీరేణు ఉరకలెత్తే ఉత్సాహంతో మొదలుపెడతాడు? అలా అతను ఊహల్లో తేలుతుండగానే.. మధు బోస్‌(ఫాతిమా సనా షేక్) అతనికి పరిచయమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలొస్తాయి. ఇక ఇద్దరికీ సెట్ కాదని శ్రీరేణు భావిస్తాడు. దీంతో ఆమెను దూరంగా పెడతాడు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిశారా? అసలు చివరికీ ప్రేమలో పడ్డారా? 40 ఏళ్లు దాటినా శ్రీరేణు పెళ్లి కళ నేరవేరిందా? అనేది తెలియాలంటే ఆప్ జైసా కోయి చూడాల్సిందే.

డైరెక్టర్ వివేక్‌ సోని నేటి సమాజానికి అవసరమైన కథనే ఎంచుకున్నారు. ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే. అలాంటి మైండ్‌సెట్‌ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు. ఒక మనిషికి ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనమిచ్చాడు దర్శకుడు.  శ్రీ రేణు లాంటి అబ్బాయి.. మధు బోస్‌ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయి. 

ఒకవైపు ప్రేమ- మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్.  ఓవరాల్‌గా చూసే పెళ్లి కానీ 42 ఏళ్ల యువకుడి కథే. కానీ ఈ ప్రేమకథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం. ఆడ, మగను ఎక్కువ, తక్కువ అంటూ చూసే వాళ్ల కళ్లు తెరిపించే ప్రేమకథా చిత్రమే ఆప్ జైసా కోయి. వీకెండ్‌లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే ఈ మూవీ ట్రై చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement