థియేటర్లలో డిజాస్టర్‌.. ఓటీటీలో టాప్‌-2లో ట్రెండింగ్! | Siddu Jonnalagadda Movie Jack Trending In Netflix | Sakshi
Sakshi News home page

Jack Movie Ott: ఓటీటీలో జాక్ మూవీ.. ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది!

May 13 2025 5:03 PM | Updated on May 13 2025 5:25 PM

 Siddu Jonnalagadda Movie Jack Trending In Netflix

సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్‌ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్‌ 10న విడుదలైన థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

అయితే జాక్ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న జాక్‌ ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం జాక్ మూవీ టాప్‌-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో అందుబాటులో ఉంది.

డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న సిద్ధు.. జాక్‌ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని అనుకున్నాడు. కానీ అంచనాలు తప్పడంతో అంతా రివర్స్ అయింది. ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement