నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్‌ డేట్‌ అదేనా? | Siddu Jonnalagadda Tillu Square Ott Streaming On This date Goes Viral | Sakshi
Sakshi News home page

Tillu Square: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్‌ ‍అప్పుడేనా?

Published Wed, Apr 17 2024 10:57 AM | Last Updated on Wed, Apr 17 2024 11:40 AM

Siddu Jonnalagadda Tillu Square Ott Streaming On This date Goes Viral - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.  డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్‌ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. 

టిల్లు స్క్వేర్‌ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్‌ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement