సడన్‌లో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie 'The Devils Chair' Streaming On This OTT | Sakshi
Sakshi News home page

The Devils Chair: మూడు నెలల తర్వాత ఓటీటీకి కుర్చీ దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?

May 22 2025 1:15 PM | Updated on May 22 2025 1:25 PM

Tollywood Movie 'The Devils Chair' Streaming On This OTT

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్‌ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ 'ది డెవిల్స్‌ చైర్‌'(the devil's chair). ఈ సినిమాకు  గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు నెలల తర్వాత ఎలాంటి ‍ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహాలో ది డెవిల్స్ ఛైర్ స్ట్రీమింగ్ అవుతోంది.

ది డెవిల్స్ చైర్‌ కథేంటంటే..

ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేసే విక్రమ్‌(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్‌ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు  రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్‌ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్‌లో ఓ డెవిల్‌ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్‌ చైర్‌ ఆఫర్‌ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్‌ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్‌లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్‌ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement