
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్‌టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుంది.
రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్
ఎయిర్‌టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్‌ను చూడవచ్చు. ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను చేర్చారు.