ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన | Telusu Kada Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన

Nov 9 2025 8:52 AM | Updated on Nov 9 2025 12:03 PM

Telusu Kada Movie OTT Streaming Date Locked

టాలీవుడ్‌ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకులు నీరజ కోన తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్‌ 17న విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో  రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి , వైవా హర్ష నటించారు.

ముక్కోణ‌పు ప్రేమ‌క‌థగా తెరకెక్కిన తెలుసు కదా చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్‌ 14 నుంచి  స్ట్రీమింగ్‌ అవుతుందని అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌(Netflix) పేర్కొంది. సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. తెలుసు కదా మూవీని సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని టాక్‌. అయితే, బాక్సాఫీస్‌ వద్ద రూ. 12 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ,  ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆపై శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లతో పాటు మ్యూజిక్ రైట్స్  కోటి వరకు బిజినెస్‌ చేయడంతో కాస్త మేరకు నష్టాలు తగ్గినట్లు తెలుస్తోంది.

కథేంటంటే..
స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్‌ బ్రేకప్‌ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్‌ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్‌ రాగా ముందుకు వస్తుంది.

కట్‌ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్‌ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్‌ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్‌. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్‌ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్‌.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్‌ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement