
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వినాయక చవితి పెద్ద సినిమాలేవీ రాలేదు. థియేటర్లలో సుందరకాండ, కన్యాకుమారి లాంచి చిన్న చిత్రాలు సందడి చేశాయి. ఈ శుక్రవారం కూడా తెలుగులో పెద్ద మూవీస్ రావడం లేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఇక వీకెండ్లో ఓటీటీ సినిమాలకు సైతం ఫుల్ డిమాండ్ ఉంటుంది. దాదాపు ఓటీటీల్లోనూ ఫ్రైడే రోజే ఎక్కువ చిత్రాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు పలు హిట్ సినిమాలు రెడీ అయిపోయాయి. బాలీవుడ్కు చెందిన మెట్రో ఇన్ డినో, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ సినిమాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు సౌత్, హాలీవుడ్కు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేసేయండి.
నెట్‌ఫ్లిక్స్
మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29
అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29
లవ్ అన్ ట్యాంగిల్డ్(కొరియన్ మూవీ)- ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) - ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29
జియో హాట్‌స్టార్
అటామిక్- వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్(హాలీవుడ్ చిత్రం)- ఆగసటు 29
హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29
జీ5
శోధా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29
సోనీ లివ్
సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29
ఆహా
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29
లయన్స్ గేట్ ప్లే
బెటర్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 29
ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29
ఆపిల్ టీవీ ప్లస్
కే పాప్డ్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 29
క్రాప్డ్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29
షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29
మనోరమ మ్యాక్స్
సార్కిట్- (మలయాళ సినిమా)- ఆగస్టు 29
సైనా ప్లే
రవీంద్ర నీ ఎవిడే-(మలయాళ సినిమా)- ఆగస్టు 29