
లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ సరసన నటిస్తోంది. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం టైటిల్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. చిరు బర్త్ డే సందర్భంగా మెగా టైటిల్ను పరిచయం చేశారు. ఈ సినిమాకు మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే కోలీవుడ్ భామ నయనతారం ఎప్పుడు ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. గతంలో చాలాసార్లు వివాదాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిన ముద్దుగుమ్మను మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతేడాది నవంబర్లో రిలీజైన డాక్యామెంటరీ నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారని నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. క్లిప్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసు అందజేసినప్పటికీ.. అదే కంటెంట్‌తో డాక్యుమెంటరీ ప్రసారం అవుతోందని ఎబి ఇంటర్నేషనల్ వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్‌ను ఆదేశించింది. ఇందుకోసం అక్టోబర్ 6 వరకు గడువు ఇచ్చింది.
టార్క్ స్టూడియోస్ నిర్మించిన నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా.. గతంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన ధనుశ్కు చెందిన వుండర్‌బార్ ఫిల్మ్స్ తమ సినిమా నానుమ్ రౌడీ దాన్ నుంచి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం కోరింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ డాక్యుమెంటరీపై మరో వివాదం మొదలైంది. కాగా.. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు.