మలయాళంలో ఈ ఏడాది (క్రిస్మస్ ముందువరకు) 184 సినిమాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే లాభాల బాట పట్టాయని అక్కడి నిర్మాతల మండలి అధికారికంగా వెల్లడించింది. వాటిలో పెద్ద హీరోల సినిమాలతో పాటు ఎకో అనే చిన్న చిత్రం కూడా చోటు దక్కించుకుంది.
చిన్న సినిమా ఘన విజయం
సందీప్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 31న అందుబాటులోకి రానుంది.
సినిమా
ఎకో.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రసారం కానుంది. ఈ సినిమాకు బహుల్ రమేశ్ కథ అందించగా దిన్‌జిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మార్క్ జయరామ్ నిర్మించాడు. వినీత్ నరైన్, సౌరభ్ సచ్‌దేవ, బిను పప్పు కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.


