త్వరలో జియోహాట్‌స్టార్‌ నెట్‌ఫ్లిక్స్‌ను దాటనుందా? | Jiohotstar Reached 300 Million Subscribers, Know About Reasons Behind Jiohotstar Growth | Sakshi
Sakshi News home page

త్వరలో జియోహాట్‌స్టార్‌ నెట్‌ఫ్లిక్స్‌ను దాటనుందా?

Jun 28 2025 9:19 AM | Updated on Jun 28 2025 11:24 AM

JioHotstar reached 300 million subscribers

అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కి జియోహాట్‌స్టార్‌ అత్యంత చేరువలో ఉంది. డిసెంబర్‌ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌కి 19 దేశాల్లో 30.16 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు+ ఉండగా ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ మొత్తం యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 5 కోట్లుగా ఉన్న సబ్‌స్క్రైబర్ల స్కయిబర్స్‌ సంఖ్య భారీగా పెరగడానికి ఇటీవల ముగిసిన టాటా ఐపీఎల్‌ క్రికెట్‌ లీగ్‌ కారణంగా నిలిచింది. డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌కి చెందిన జియోసినిమా విలీనంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన జియోస్టార్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌కి డిజిటల్‌ వ్యూయర్‌షిప్‌ 65.2 కోట్ల స్థాయిని దాటగా, టీవీలో వ్యూయర్‌షిప్‌ 53.7 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు

జియోహాట్‌స్టార్‌ ఎదుగుదలకు కారణమేంటి?

ఐపీఎల్‌ 2025: క్రికెట్ టోర్నమెంట్ గేమ్ ఛేంజర్‌గా ఈ ఈవెంట్‌ నిలిచింది. 65.2 కోట్ల డిజిటల్ వీక్షకులను ఇది ఆకర్షించింది. మొదటిసారి టీవీ వ్యూయర్‌షిప్‌ను అధిగమించింది.

విలీనం: జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్లను జియోహాట్‌స్టార్‌లోకి విలీనం చేయడం కంటెంట్, డిస్ట్రిబ్యూషన్ జోష్‌ను సృష్టించింది.

డివైజ్‌ రీచ్: 104 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లున్నాయి.

ప్రకటనలు: ఐపీఎల్ సీజన్లో 40 కేటగిరీల్లో 425 మంది అడ్వర్టైజర్లను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement