పోస్టాఫీసుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు | Post Offices Across India Officially Begin Accepting Digital Payments, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Post Office Digital Payments: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు

Jun 28 2025 8:59 AM | Updated on Jun 28 2025 10:27 AM

post offices across India officially begin accepting digital payments

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఆగస్టు నుంచి డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే విధానం అందుబాటులోకి రానుంది. డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో లావాదేవీలను నిర్వహించేందుకు ఉపయోగపడే ఐటీ మౌలిక సదుపాయాల కల్పన ఆగస్టు నాటికి అన్ని పోస్టాఫీసుల్లో పూర్తవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఐటీ 2.0 కింద కొత్త సిస్టం పైలట్‌ ప్రాజెక్టు ఇప్పటికే కర్ణాటక సర్కిల్‌లో ప్రారంభమైందని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ జీటీ సిరీస్‌లో స్పోర్ట్స్‌ కార్లు

మైసూర్‌ హెడ్‌ ఆఫీస్, బాగల్‌కోట్‌ హెడ్‌ ఆఫీసు మొదలైన ప్రాంతాల్లో క్యూఆర్‌ ఆధారిత బుకింగ్‌ సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించాయి.  యూపీఐ వ్యవస్థతో పోస్టాఫీసుల ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వెసులుబాటు ఉండటం లేదు. గతంలో సేల్‌ కౌంటర్స్‌లో స్టాటిక్‌ క్యూఆర్‌ కోడ్‌ను పోస్టల్‌ శాఖ ప్రవేశపెట్టినప్పటికీ, పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానాన్ని నిలిపివేసారు.
 

Advertisement
 
Advertisement
Advertisement