రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ జీటీ సిరీస్‌లో స్పోర్ట్స్‌ కార్లు | Mercedes AMG GT series luxury meets unfiltered performance | Sakshi
Sakshi News home page

రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ జీటీ సిరీస్‌లో స్పోర్ట్స్‌ కార్లు

Jun 28 2025 8:41 AM | Updated on Jun 28 2025 8:41 AM

Mercedes AMG GT series luxury meets unfiltered performance

ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం 

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా కొత్తగా జీటీ సిరీస్‌లో రెండు స్పోర్ట్స్‌ కార్లను ఆవిష్కరించింది. వీటిలో ఏఎంటీ జీటీ 63 ఫోర్‌మ్యాటిక్‌ప్లస్, జీటీ 63 ప్రో ఫోర్‌మ్యాటిక్‌ప్లస్‌ కూపే ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.3 కోట్లు, రూ.3.65 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఎస్‌పీఎంఈపీసీఐ పథకం కొత్త విదేశీ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. భారత్‌లో తాము గత ముప్ఫై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే పుణె ప్లాంటుపై రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని వివరించారు. స్కీమును ప్రకటించడానికి ముందు నుంచే రెండు కార్ల మోడల్స్‌ను దేశీయంగా ఈ ప్లాంటులోనే తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏఎంజీ జీటీ 63 4 మ్యాటిక్‌+

  • పవర్: 585 బీహెచ్‌పీ, 800 ఎన్ఎమ్ టార్క్

  • 0–100 కిమీ/గం: 3.2 సెకన్లలో అందుకుంటుంది.

  • గరిష్ట వేగం: గంటకు 315 కి.మీ.

  • ధర: రూ .3 కోట్లు (ఎక్స్-షోరూమ్)

ఇదీ చదవండి: ‘సారీ సర్‌.. వెజిటేరియన్‌ ఫ్యామిలీ కావాలి’

ఏఎంజీ జీటీ 63 ప్రో 4 మ్యాటిక్‌+

  • పవర్: 612 బీహెచ్‌పీ, 850 ఎన్ఎమ్ టార్క్

  • 0–100 కి.మీ/గం: 3.1 సెకన్లలో అందుకుంటుంది.

  • గరిష్ట వేగం: గంటకు 317 కి.మీ.

  • ధర: రూ.3.65 కోట్లు (ఎక్స్-షోరూమ్)

Advertisement
 
Advertisement
Advertisement