‘సారీ సర్‌.. వెజిటేరియన్‌ ఫ్యామిలీ కావాలి’ | Chennai based man shared a message that non veg injurious to finding flats | Sakshi
Sakshi News home page

‘సారీ సర్‌.. వెజిటేరియన్‌ ఫ్యామిలీ కావాలి’

Jun 27 2025 2:38 PM | Updated on Jun 27 2025 3:55 PM

Chennai based man shared a message that non veg injurious to finding flats

చెన్నైలో అద్దెకు ఉండేందుకు ఫ్లాట్ల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. మీలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది. ఇదే అంశంపై ఆన్‌లైన్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో దాదాపు చాలామందికి ముక్కలేనిదే ముద్దదిగదనే ధోరణి వచ్చేసింది. అలాంటిది నాన్‌వెజ్‌ తింటే ఇల్లు అద్దెకు అవ్వబోమని ఓ యజమాని చెప్పడం చర్చకు దారితీసింది.

సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ రంగస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాడు. ఓ ఫ్లాట్‌ యజమానిని వాట్సప్‌ ద్వారా సంప్రదించాడు. ‘మీరు నాన్‌వెజ్‌ తింటే ఇల్లు అద్దెకు ఇవ్వబోం. సారీ సర్‌.. వెజిటేరియన్‌ ప్యామిలీ కోసం చూస్తున్నాం’ అంటూ యాజమాని చెప్పాడు. దాంతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ప్రశాంత్‌ ఆందోళన చెందుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్‌షాట్‌ తీసి సామాజిక మాధ్యామాల్లో షేర్‌ చేశారు.  ‘చెన్నైలో అద్దెకు ఫ్లాట్లు దొరకాలంటే నాన్ వెజ్ తినడం హానికరం’ అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు.

ఇదీ చదవండి: సిబిల్‌ సరిగా లేదని ఎస్‌బీఐ ఉద్యోగం రద్దు

మీలో లేదా మీకు తెలిసిన వారిలో చాలామంది ఈ సమస్యను ఏదుర్కొనే ఉంటారు. ఈ తంతు ఇంకెంత కాలం అంటూ కొందరు ఈ పోస్ట్‌కు రిప్లై ఇస్తుంటే.. సైలెంట్‌గా వేరే ఇల్లు చూసుకోండంటూ ఇంకొందరు చెప్పారు. ‘నేను శాకాహారినే. కానీ చుట్టూ మాంసం తినేవారున్న యూరప్‌లో నివసించాను. ఎప్పుడూ సమస్య లేదు. కానీ ఇక్కడ, ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి’ అని ఒక యూజర్ అన్నారు. అయితే కొందరు మాత్రం తమ ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలో నిర్ణయించే హక్కు ఇంటి యజమానులకు ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement