అడ్వాన్స్‌గా ఆరు నెలల రెంట్‌.. ఆపై ఎన్నో ఛార్జీలు | Bengaluru tenant viral Reddit post has reignited debate over the security deposit | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌గా ఆరు నెలల రెంట్‌.. ఆపై ఎన్నో ఛార్జీలు

Jun 20 2025 3:50 PM | Updated on Jun 20 2025 5:19 PM

Bengaluru tenant viral Reddit post has reignited debate over the security deposit

బెంగళూరులో కఠినమైన అద్దె విధానాలపై రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో అద్దెదారులను ఇబ్బంది పెట్టేలా ఉన్న నిబంధనల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దెకు ఉండడం కంటే డబ్బు ఖర్చయినా సొంతంగా ఇళ్లు కొనడం బెటర్‌ అనే ధోరణికి వస్తున్నట్లు చెప్పారు.

కొంతకాలంపాటు బెంగళూరు నగరం బయట అద్దెకు ఉన్న ఒక యూజర్‌ ఇటీవల నగరం లోపలకు మకాం మార్చినట్లు చెప్పారు. తమ కొత్త ఇంటి యజమాని అసంబద్ధమైన డిమాండ్లు పెడుతున్నాడని రాశారు. బెంగళూరులో ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తప్పుబడుతూ ‘మొదట వారు ఆరు నెలల డిపాజిట్, అడ్వాన్స్ రెంట్ తీసుకుంటారు. మీరు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇంటిని తిరిగి శుభ్రం చేయించేందుకు, కొత్తవారి కోసం మీరు వాడిన వస్తువులను మార్చేందుకు డబ్బు అవసరం అవుతుందని చెప్పి అధిక మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డిపాజిట్ తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా వారికి లేదు’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్‌!

బెంగళూరు రియల్టీ మార్కెట్‌లో సాధారణంగా అద్దెదారుల నుంచి ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్‌ను తీసుకుంటున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అందుకే నగరంలో స్వల్పకాలిక నివాసం ఉన్నవారు కూడా సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ దోపిడీ నుంచి బయటపడాలనుకుంటున్నారని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘వారు ఆ డిపాజిట్‌ను ఉపయోగించి ఇంటిని పునరుద్ధరిస్తారు. అది మా డబ్బు. ప్యూర్ టార్చర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నా మునుపటి ఇంటి యజమాని తన ఇంటి గోడలపై 1-2 చోట్ల పెయింటింగ్‌ పోయినందుకు మొత్తం పెయింటింగ్ అయ్యే ఖర్చును వసూలు చేశాడు’ అని మరో యూజర్‌ రిప్లై ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement