నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్‌! | Vietnam cheapest country to live as an expat in 2025 | Sakshi
Sakshi News home page

నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్‌!

Jun 20 2025 2:34 PM | Updated on Jun 20 2025 3:34 PM

Vietnam cheapest country to live as an expat in 2025

ప్రతి దేశంలో ఆరోగ్య సంరక్షణ, రవాణా, అద్దె, ఆహారం, యుటిలిటీల ఖర్చును పరిశీలించి చౌకైన దేశమా? ఖరీదైన దేశమా? అని నిర్ణయిస్తారు. విలియం రస్సెల్‌ అనే రిసెర్చ్‌ అనలిస్ట్‌ 2025లో మూడు చౌకైన ప్రాంతాల వివరాలు వెల్లడించారు. అందులో వియత్నాం ముందు వరుసలో నిలిచింది.

వియత్నాం ప్రవాసులు జీవించడానికి అత్యంత చౌకైన దేశంగా ఉందని విలియం రస్సెల్ తెలిపారు. మంచి ఆహారం, స్నేహపూర్వక స్థానికులు, ఆధునిక సౌకర్యాలు, పురాతన సంప్రదాయాలు అన్నీ వియత్నాంలో ఉన్నాయని చెప్పారు. నెలకు సగటున సింగల్‌బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌కు 265 పౌండ్‌ స్టెర్లింగ్‌(రూ.30 వేలు), మూడు పడక గదుల అపార్ట్‌మెంట్‌కు 589 పౌండ్‌ స్టెర్లింగ్‌(రూ.68 వేలు) ఖర్చవుతుందని అన్నారు. వియత్నాంలో మొత్తం జీవన వ్యయం యూకే కంటే 59 శాతం చౌకగా ఉందని తెలిపారు. కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఏటా నర్సరీ ఫీజు రూ.1లక్షపైనే ఉందని కొందరు చెబుతున్న నేపథ్యంలో వియత్నాంలోని ఇంటి అద్దెలు వాటి కంటే చీప్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: సన్‌టీవీ ఛైర్మన్‌కు ఆయన సోదరుడు నోటీసులు

బొలీవియా ప్రవాసులకు రెండో అత్యంత చౌకైన దేశంగా ఉందని చెప్పారు. రాజధాని లా పాజ్‌లో ఒక పడకగది అపార్ట్‌మెంట్‌ ధర నెలకు 386 డాలర్లు(రూ.33 వేలు), మూడు పడక గదుల అపార్ట్‌మెంట్‌ ధర 707 డాలర్లు(రూ.45 వేలు) అని అన్నారు. జార్జియా మూడో చౌకైన గమ్యస్థానంగా ఉందని విలియం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement