రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలుతుందా? | What Happens To Indian Economy If Gen Z Never Buys A House? Here’s What It Could Mean For India’s Real Estate Market | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలుతుందా?

Aug 8 2026 3:18 PM | Updated on Aug 8 2026 3:50 PM

What Happens To Indian Economy If Gen Z Never Buys A House

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇలాంటి సమయంలో జెన్ జీ (Gen Z) తరం ఇళ్లు కొనడం మానేస్తే?, ఏమవుతుందనే ప్రశ్న తలెత్తింది. దీనికి చాలామంది మార్కెట్ కుప్పకూలుతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెబుతారు. కానీ నిపుణులు ఇది నిజం కాదని అంటున్నారు.

జెన్ జీ ఇళ్లు కొనడం తగ్గిస్తే.. రియల్ ఎస్టేట్ మార్కెట్ వెంటనే కుప్పకూలిపోతుందని అనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే.. వీరు నివసించడానికి కూడా ఇల్లు అవసరమే. అయితే.. ఆ ఇల్లు సొంతంగా కొనవచ్చు, అద్దెకు తీసుకోవచ్చు లేదా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావచ్చు.

జెన్ జీ ఇల్లు కొనడాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ.. తొందరగా ఇల్లు కొనాల్సిన అవసరం లేదని భావిస్తోంది. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కొనాలని అనుకునేవారు. కానీ నేడు ముందుగా డబ్బు సంపాదించి.. సేవింగ్స్ పెంచుకుని, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి, ఆ తరువాత ఇల్లు కొనాలనుకుంటున్నారు.

ఈ మార్పు కొంత రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపవచ్చు. ఒక ఇల్లు అమ్ముడైతే బిల్డర్ మాత్రమే కాదు.. సిమెంట్, స్టీల్, పెయింట్, ఫర్నిచర్, నిర్మాణ కార్మికులు, బ్యాంక్స్, ప్రభుత్వాలు కూడా లాభపడతాయి. కాబట్టి యువత ఇల్లు కొనడాన్ని ఐదు లేదా పది సంవత్సరాలు ఆలస్యం చేస్తే కొత్త ప్రాజెక్ట్స్, హోమ్ లోన్స్, కన్స్ట్రక్షన్ జాబ్స్, స్టాంప్ డ్యూటీ  ఆదాయం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జెన్ జీ ఇల్లు కొనకుండా ఆ డబ్బును స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడితే.. ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమవ్వదు. అంటే.. డబ్బు ఒక రంగం నుంచి మరో రంగానికి మారుతుంది. ఇప్పటివరకు భారతీయ కుటుంబాల సంపదలో పెద్ద భాగం ప్రాపర్టీలలో ఉంది. యువత మాత్రం తమ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. మొత్తం మీద జెన్ జీ ఇళ్లు కొనడం మానేయదు, కొంత ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇళ్లకు డిమాండ్ ఉంటుంది.

ఇదీ చదవండి: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement