ప్రభుదేవా కొత్త లగ్జరీ కారు: ధర ఎంతో తెలుసా? | Actor Prabhu Deva Adds MG M9 To His Garage Know About The Luxury MPV | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా కొత్త లగ్జరీ కారు: ధర ఎంతో తెలుసా?

Jun 19 2026 8:53 PM | Updated on Jun 19 2026 9:05 PM

Actor Prabhu Deva Adds MG M9 To His Garage Know About The Luxury MPV

నటులు, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత అయిన ప్రభుదేవా తన గ్యారేజీకి సరికొత్త ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని చేర్చారు. దీంతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన సెలబ్రిటీల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఈ కారు ధర రూ. 75.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు అనేది లిమోసిన్ లాంటి సౌకర్యం, విశాలమైన క్యాబిన్, అధునాతన సాంకేతికతతో మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఇది కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది.

ఎంజీ ఎం9 సొగసైన ఎల్ఈడీ లైటింగ్, క్రోమ్ డీటైలింగ్, పెద్ద విండోస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ పొందుతుంది. క్యాబిన్ కాగ్నాక్ బ్రౌన్ అండ్ బ్లాక్ అనే డ్యూయల్ టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. దీనికి ప్రీమియం ట్రిమ్ ఇన్సర్ట్‌లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ తోడవుతాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెనుక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, ఎలక్ట్రికల్‌గా పనిచేసే స్లైడింగ్ డోర్లు, మెమరీ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఒక సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఈ సెటప్ 245 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో 548 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణాలకు, సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement