
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో రెండు సినిమాలు రిలీజ్ రెడీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే వచ్చిందంటే స్ట్రీమింగ్కు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం హిందీలో బిగ్ హిట్ కొట్టిన సయారా, తెలుగులో బకాసుర రెస్టారెంట్, రాంబో ఇన్ లవ్ లాంటి వెబ్ సిరీస్లు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
సయారా (హిందీ సినిమా) - సెప‍్టెంబరు 12
యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12
మాలెడిక్షన్స్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12
రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 12
మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14
అమెజాన్ ప్రైమ్
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12
ఎవ్రీ మినిట్ కౌంట్స్ - సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12
ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12
స్క్రీమ్ బోట్- (ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబరు 12
జియో హాట్ స్టార్
రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12
సన్ నెక్ట్స్
మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12
బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12
లయన్స్ గేట్ ప్లే
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12
ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12
హులు అండ్ డిస్నీ ప్లస్
లాస్ట్ ఇన్ ది జంగిల్- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- సెప్టెంబర్ 12
హెచ్బీవో మ్యాక్స్
వార్ఫేర్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12