హాలీవుడ్‌కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్ భారీ ధరనే కోట్ చేసింది. ఏకంగా రూ. 6.50లక్షల కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. హాలివుడ్‌లో ఎంతో విలువైన కంపెనీగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్ ఈ రేంజ్‌లో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి.
ఇండియన్ సినిమాలో పెను మార్పులు
ఈ డీల్ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియన్ సినిమా పరిశ్రమలో పెను మార్పులు తెస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్ ( Netflix) దీర్ఘకాలిక థియేట్రికల్ రన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వదు. అంటే ఎంతపెద్ద సినిమా అయినా సరే కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురానుంది. 6–8 వారాల థియేట్రికల్ రన్స్ అనే రూల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండకపోవచ్చు. అయితే, థియేటర్లలో విడుదలలు కొనసాగుతాయని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కానీ, విడుదల అయ్యే థియేటర్స్ సంఖ్య తప్పకుంగా తగ్గుతుంది. కేవలం మల్టీఫ్లెక్స్‌లలో మాత్రమే సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. దీంతో చిన్న సినిమాలకు మరింత గడ్డుపరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
వార్నర్ బ్రదర్స్ స్ట్రీమింగ్ జెయింట్స్ స్టూడియోలను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తే.., థియేటర్లకు నిరంతర సినిమాల సరఫరా తగ్గిపోతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) హెచ్చరించింది. నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియన్ సినిమా నుంచి మంచి మార్కెట్ ఉంది కాబట్టి వారి వ్యాపార దృష్టి ఇక్కడ తప్పకుండా పడుతుందని పేర్కొంది. అదే జరిగితే భారత్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు మరింత ప్రమాదమని తెలిపింది. ఇక నుంచి పెద్ద స్టూడియో సినిమాలను నెట్‌ఫ్లిక్స్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో మల్టీఫ్లెక్స్ (PVR, INOX) వంటి వాటితో తమ స్టూడియోలతో డీల్ చేసుకోవచ్చు.
కానీ, చిన్న థియేటర్స్‌కి ఆ అవకాశాలు తక్కువ. నెట్‌ఫ్లిక్స్‌కు అలవాటు పడినప్పుడు రానురాను పెనుమార్పులు వస్తాయి. థియేటర్స్ ఎక్సిపీరియన్స్ తగ్గిపోవడం వంటి జరుగుతాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లు ఎదోలా కొనసాగినప్పటికీ చిన్న థియేటర్స్ మూతపడే ప్రమాదం ఉంది. పెద్ద స్టూడియో సినిమాలు లేకపోతే సింగిల్ థియేటర్స్ నడవడం కష్టం అవుతుంది. ఆపై OTTలో త్వరగా సినిమాలు వస్తే.., థియేటర్‌కి వెళ్లే ఉత్సాహం కూడా ప్రేక్షకులలో తగ్గుతుంది.
థియేటర్స్ రిలీజ్ అవసరమే
నెట్‌ఫ్లిక్స్ ఎంత స్ట్రాంగ్ పుంజుకున్నా సరే థియేటర్ ఇండస్ట్రీని నాశనం చేయలేదు. అవెంజర్స్, బ్యాట్‌మెన్ గాడ్జిల్లా డ్యూన్ వంటి సినిమాలు ఇంట్లో కూర్చొని చూడలేం. ఇలాంటివి పెద్ద స్క్రీన్‌లోనే చూసేందుకు ఇష్టపడుతారు. నెట్‌ఫ్లిక్స్‌కు కూడా థియేటర్స్ రిలీజ్ ఉంటేనే మేలు అనుకుంటుంది. పెద్ద స్క్రీన్‌లో సినిమా విడుదలైతేనే తన మార్కెట్‌కు మరంతి బలం చేకూరుతుంది. సులువుగా ఆ చిత్రానికి ప్రమోషన్ దొరుకుతుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కూడా థియేటర్లలో విడుదలలు కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.


