మరో వారం రోజులే...నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలు అవుట్‌..! | Netflix July 2025 Removals: Here Complete List Of Removals Movies | Sakshi
Sakshi News home page

మరో వారం రోజులే...నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలు అవుట్‌..!

Jul 23 2025 1:18 PM | Updated on Jul 23 2025 2:47 PM

Netflix July 2025 Removals: Here Complete List Of Removals Movies

ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది. బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే. అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి.. వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్‌బీట్‌ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్‌ల వరకు ఉన్నాయి ఈ జూలై 31లోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి. ఆ సినిమాలివే...

రెడ్‌ ఐ (2005)
వెస్‌ క్రావెన్‌ దర్శకత్వం వహించిన రెడ్‌ ఐ థ్రిల్లర్‌లో హోటల్‌ మేనేజర్‌ అయిన రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్‌ మర్ఫీని అర్థరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్ లో కలుస్తుంది. వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది? రెడ్‌ ఐలో చూడొచ్చు. అనుక్షణం ఉత్కoఠ తో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుంది

అవేకెనింగ్స్‌ (1990)
పెన్నీ మార్షల్‌ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్‌ చిత్రంలో రాబిన్‌ విలియమ్స్‌ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు. కాటటోనిక్‌ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి? పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కధలో రాబర్ట్‌ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్‌ లోవ్‌ కనిపిస్తాడు. జీవితంలోని సంక్షిప్త, విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు.

అమెరికన్‌ బ్యూటీ (1999)
సామ్‌ మెండిస్‌ దర్శకత్వం వహించగా, ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఈ డార్క్‌ కామెడీలో కెవిన్‌ స్పేసీ లెస్టర్‌ బర్న్‌హామ్‌గా నటించాడు, శివారు ప్రాంతాల్లోని రొటీన్‌ లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. అన్నెట్‌ బెనింగ్, థోరా బిర్చ్‌ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కాంక్ష, గుర్తింపులతో పాటు అమెరికన్‌ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది.

అమెరికాస్‌ స్వీట్‌హార్ట్స్‌ (2001)
జో రోత్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ కామెడీలో ఒకనాటి స్టార్‌ హీరోయిన్‌ జూలియా రాబర్ట్స్‌ హాలీవుడ్‌ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు, ఆమెతో పాటు కేథరీన్‌ జీటా జోన్స్ జాన్‌ కుసాక్‌ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బిల్లీ క్రిస్టల్‌ హాస్యాన్ని జోడిస్తూ, ఈ చిత్రం గ్లామర్‌ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందరగోళాన్ని మనకు చూపిస్తుంది.

పంచ్‌ డ్రంక్‌ లవ్‌ (2002)
విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ నుంచి వచ్చిన ఈ ఆఫ్‌బీట్‌ రొమాంటిక్‌ డ్రామాలో ఆడమ్‌ సాండ్లర్‌ బారీ ఎగాన్‌ పాత్రలో నటించారు, కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి, అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్‌ తో ప్రేమలో పడతాడు. చమత్కారమైన, సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్‌ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement