
ఓటీటీలో కంటెంట్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.