
కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్‌ను తొలిసారిగా ఒరిజినల్ టీవీ షోలో ఉపయోగించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ప్రాంప్ట్స్ ఆధారంగా వీడియోలు, చిత్రాలను రూపొందించే ఏఐని అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ షో ‘ది ఎటర్నాట్’లో భవనం కూలిపోయే సన్నివేశాన్ని సృష్టించడానికి ఉపయోగించినట్లు కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెడ్ సారాండోస్ తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ బృందం వేగంగా, తక్కువ ఖర్చుతో సన్నివేశాలను పూర్తి చేయగలిగిందని చెప్పారు.
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో వివాదాస్పదంగా ఉంది. ఇది ఇతరుల పనిని వారి అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్ సృష్టిస్తుందనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి సారాండోస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చిన్న బడ్జెట్ ఉన్న నిర్మాణాలకు అధునాతన విజువల్ ఎఫెక్స్ట్ ఉపయోగించడానికి అనుమతించినట్లు చెప్పారు. బ్యూనస్ ఎయిర్స్‌లో ఒక భవనం కూలిన క్రమాన్ని సంప్రదాయ స్పెషల్ ఎఫెక్ట్స్ టూల్స్ ఉపయోగించిన దానికంటే 10 రెట్లు వేగంగా పూర్తి చేయడానికి ఎటెర్నాట్‌లో ఉపయోగించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ బృందానికి సహాయపడిందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా
దక్షిణ కొరియా థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడో, చివరి సిరీస్ విజయం సాధించడంతో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇది ఇప్పటివరకు 122 మిలియన్ వ్యూస్ సాధించిందని సారాండోస్ అన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జూన్ నెలాఖరు వరకు మూడు నెలల్లో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 16 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు (8.25 బిలియన్ పౌండ్లు) చేరుకున్నట్లు ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాభాలు 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి.