
బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తనకు పిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి ఓ వీడియోని షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?)
తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అసలు పేరు శివజ్యోతి. కానీ సావిత్రిగానే చాలా ఫేమస్ అయింది. తెలంగాణలోని నిజామాబాద్ నాగంపేట ఈమె సొంతూరు. పదేళ్ల క్రితమే గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లో వాళ్లు నో చెప్పినా సరే పెళ్లి చేసుకుంది. అయితే బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొని మరింత ఫేమస్ అయింది. తర్వాత షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బాగానే సంపాదించింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.
'అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం ఎదురు చేసిండ్రో. మీరు నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావకి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న. అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. దిష్టి పెట్టొద్దు. ఆశీర్వదం చాలు. ఈ బ్యూటీఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను మర్చిపోను, బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను' అని శివజ్యోతి రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)