
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గత నెల 10న వీళ్లకు మగ పిల్లాడు పుట్టాడు. రీసెంట్‌గానే మూడు నాలుగు రోజుల క్రితం బారశాల వేడుక జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. కాకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు.
(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)
ఇప్పుడు స్వయంగా వరుణ్-లావణ్య దంపతులు తమ కొడుకు పరిచయం చేస్తూ పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు రెండు ఫొటోల్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టేస్తున్నారు.
నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు.
(ఇదీ చదవండి: కాంతార 1 టీమ్‌పై 'ఎన్టీఆర్' కామెంట్స్)