
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా తారక్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ క్రమంలో కాంతార1 టీమ్‌కు అభినందనలు చెప్పారు.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుందని తారక్ అన్నారు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఎవ్వరి ఊహకు అందని అద్భుతాన్ని క్రియేట్ చేశాడని కొనియాడారు.. రిషబ్ మీద నమ్మకాన్ని ఉంచి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారికి శుభాకాంక్షలు అంటూ తారక్ ఒక పోస్ట్ చేశారు.
కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేశారు. దీంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.