
టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన మూడో కూతురు స్రవంతి నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడా ఈ విషయం పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు ఫొటోలు బయటకు రావడంతో దీని గురించి అంతా తెలిసింది.
(ఇదీ చదవండి: త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన)
వైజయంతి ప్రొడక్షన్ తరఫున సినిమాలు తీస్తూ వచ్చిన అశ్వనీదత్.. కొన్నేళ్ల క్రితం సైలెంట్ అయిపోయారు. తర్వాత ఈయన కూతుళ్లు స్వప్న, ప్రియాంక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలతో మళ్లీ తండ్రి నిర్మాణ సంస్థని రేసులోకి తీసుకొచ్చారు. గతేడాది వచ్చిన 'కల్కి'తో పాన్ ఇండియా లెవల్లోనూ హిట్ కొట్టారు.
అయితే అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే ఈయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు. తండ్రి అక్కలు నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ ఈమెకు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లే కనిపిస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో ఈమె గురించి తెలిసింది. మరి పెళ్లి కూడా ఈ ఏడాదిలో ఉంటుందేమో!
(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)