
బిగ్‌బాస్ మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కామనర్స్ నుంచి మర్యాద మనీశ్ హౌస్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఇక మూడో వారం మొదటి రోజే హౌస్ మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఓనర్స్, టెనెంట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఎంత హీటక్కిపోయిందో అర్థమవుతోంది.
తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు నువ్వు గేమ్‌లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. పక్కనోడి పర్సనల్ పాయింట్‌తో నాకేంటి? అంటూ గట్టిగానే కౌంటరిచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య చిన్నపాటి గొడవను తలపించింది. నువ్వు వెళ్లు అని శ్రీజ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి అంటూ రీతూ మండిపడింది. దీంతో వెంటనే మాస్క్ మ్యాన్ హరీశ్ ఎంట్రీ ఇచ్చాడు. మనందరినీ నామినేషన్స్‌లో పెట్టడమే వారి ఉద్దేశమని అన్నారు. దీనిపై రీతూ చౌదరి మరోసారి ఆవేశంతో ఊగిపోయింది. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఏ రేంజ్‌లో జరిగిందో అర్థమవుతోంది.
Nominations heat rising!
Owners and Tenants go head-to-head! 👁️🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/CGio3EffLF— Starmaa (@StarMaa) September 22, 2025