
త్వరలో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)
తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్‌లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా పాల్గొన్నాడు. రన్నరప్‌గా నిలిచాడు.
కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్‌గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు)