తిరుమల శ్రీవారి సేవలో అక్కినేని జంట | Naga Chaitanya and Sobhita Visit Tirumala for Blessings | Sakshi
Sakshi News home page

తిరుమలలో నాగచైతన్య దంపతులు.. ఫొటోలు వైరల్

Aug 21 2025 2:04 PM | Updated on Aug 21 2025 3:19 PM

Naga Chaitanya And Sobhita Tirumala Darshan Latest

అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో నాగచైతన్య దంపతులని పండితులు ఆశీర్వదించారు.  ఈ క్రమంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)

కెరీర్ విషయానికొస్తే నాగచైతన్య.. ఈ ఏడాది 'తండేల్'తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కొరటాల శివతోనూ కొత్త సినిమా చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు లేదు. చాలారోజుల తర్వాత వీళ్లు మరోసారి జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.

(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement