Photo Credit: Twitter
రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్-సిలో గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని డబుల్ సెంచరీతో చెలరేగాడు. 246 బంతుల్లో 217 పరుగులు చేసిన బదోని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (199) పరుగు తేడాతో ద్విశతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ 122 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది. సుమిత్ మాథుర్ (55 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా, అనూజ్ రావత్ (6) అతడికి సహకరిస్తున్నాడు. ప్రియాన్ష్ ఆర్య, ఆయుష్ బదోనిలు నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించారు.
అనంతరం బదోని, సుమిత్ మాథుర్‌లు ఐదో వికెట్‌కు 167 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను 500 మార్క్‌ను దాటించారు. గుజరాత్ బౌలర్లలో హర్షల్‌పటేల్ రెండు వికెట్లు తీయగా, జయ్‌మీత్ పటేల్, మనన్ హింగ్రాజియా చెరొక వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి:


