Photo Credit: Twitter
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను ముగించుకున్న టీమిండియా బృందం సోమవారం న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అర్షదీప్, అభిషేక్, అక్షర్ పటేల్, నమన్ ధీర్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇక భువనేశ్వర్, వైభవ్ సూర్యవంశీలు ఎయిర్‌పోర్టులో తమ లగేజీతో దర్శనమిచ్చారు. మొదటి బృందంలో ఏడుగురు క్రికెటర్లు, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర సిబ్బంది న్యూజిలాండ్‌కు బయల్దేరి వెళ్లారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తర్వాత జాయిన్ కానున్నారు.

రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియా మొదట ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం రెండు టెస్టులు ఆడనుంది. మొదట టీ20 సిరీస్ జరగనుండడంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ముందుగా బయల్దేరి వెళ్లింది. విండీస్‌తో టీ20 సిరీస్ ఆడిన జట్టులో ఉన్న ఆటగాళ్లే ఈ సిరీస్‌లో కూడా ఆడనున్నారు.
అక్టోబర్ 22న ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 1న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు జరగనున్న వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చి వేదికగా, మూడో టీ20 వెల్లింగ్‌టన్‌లో, ఆక్లాండ్ వేదికగా నాలుగో టీ20, హామిల్టన్ వేదికగా ఐదో టీ20 జరగనుంది. మ్యాచ్‌లన్నీ న్యూజిలాండ్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలుకానున్నాయి.
మ్యాచ్‌ల షెడ్యూల్, వేదిక, సమయం..
అక్టోబర్ 22- తొలి టీ20, క్రైస్ట్‌చర్చి, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
అక్టోబర్ 24- రెండో టీ20, క్రైస్ట్‌చర్చి, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
అక్టోబర్ 27- మూడో టీ20, వెల్లింగ్‌టన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
అక్టోబర్ 30- నాలుగో టీ20, ఆక్లాండ్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
నవంబర్ 1న- ఐదో టీ20, హామిల్టన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
INDIAN T20I TEAM ON THE WAY TO NEW ZEALAND 🇮🇳🔥 https://t.co/2LSPalhw4n
— Johns. (@CricCrazyJohns) October 19, 2026
ఇదీ చదవండి:


