చరిత్ర సృష్టించిన భారత షూటర్లు.. స్వ‌ర్ణం, ర‌జ‌తం మ‌న‌వే | Mona-Gold-Avani-Silver-Women-10M Air-Rifle-SH1-Final-Asian Para Games | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత షూటర్లు.. స్వ‌ర్ణం, ర‌జ‌తం మ‌న‌వే

Oct 19 2026 11:50 AM | Updated on Oct 19 2026 1:12 PM

Mona-Gold-Avani-Silver-Women-10M Air-Rifle-SH1-Final-Asian Para Games

ఆసియా పారా గేమ్స్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్‌-1 విభాగంలో మోనా సింగ్‌ అగర్వాల్‌, అవనీ లేఖరా స్వర్ణ, రజతాలతో మెరిశారు. సోమవారం జరిగిన ఎస్‌హెచ్‌-1 ఫైనల్ ఈవెంట్‌లో మోనా అగ‌ర్వాల్ 250 పాయింట్లు స్కోరుతో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ఎగ‌రేసుకుపోగా, 249.6 పాయింట్లు స్కోరు న‌మోదు చేసి రెండో స్థానంలో నిలిచి ర‌జ‌తం ద‌క్కించుకుంది. 

ఇక ద‌క్షిణ కొరియాకు చెందిన లీ యున్రీ కాంస్య ప‌త‌కం సాధించింది. కాగా మోనా అగ‌ర్వాల్ గ‌త ఆసియా గేమ్స్ రికార్డును బ‌ద్ద‌లుకొట్ట‌డం విశేషం. హాంగ్జౌ వేదిక‌గా జ‌రిగిన గ‌త పారా ఆసియా గేమ్స్‌లో అవ‌నీ లేఖ‌రా సాధించిన 249.6 స్కోరును అధిగ‌మించిన మోనా తొలి స్థానంలో నిలిచింది. అంత‌క‌ముందు క్వాలిఫికేష‌న్ రౌండ్‌లోనూ ఈ ఇద్ద‌రు అద‌ర‌గొట్టారు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో మోనా 629.1 స్కోరుతో తొలి స్థానంలో నిల‌వ‌గా, అవ‌నీ లేఖ‌రా 626.4 స్కోరుతో మోనాను అనుస‌రించింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement