ప్ర‌పంచ రికార్డుతో మెరిసిన శీత‌ల్ దేవీ | Sheetal Devi Sensational Performance-Matches-World-Record-Asian Para Games | Sakshi
Sakshi News home page

Asian Para Games: ప్ర‌పంచ రికార్డుతో మెరిసిన శీత‌ల్ దేవీ

Oct 19 2026 11:11 AM | Updated on Oct 19 2026 11:22 AM

Sheetal Devi Sensational Performance-Matches-World-Record-Asian Para Games

Photo Credit: Twitter

భార‌త పారా ఆర్చ‌ర్ శీత‌ల్ దేవీ ఆసియా పారా గేమ్స్‌లో ప్ర‌పంచ రికార్డుతో మెరిసింది. ఆర్చ‌రీ మ‌హిళ‌ల కాంపౌండ్ క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో శీత‌ల్ దేవీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 720 పాయింట్ల‌కు 704 పాయింట్లు సాధించి ప్ర‌పంచ రికార్డును స‌మం చేయ‌డంతో పాటు స‌రికొత్త ఆసియా రికార్డును నెల‌కొల్పింది. గతంలో ఆసియా గేమ్స్‌లో తాను నెల‌కొల్పిన 698 పాయింట్ల రికార్డును ఆరు పాయింట్ల తేడాతో బ‌ద్ద‌లు కొట్టి కొత్త రికార్డును త‌న పేరిట లిఖించుకుంది.

ఇక జూడోలో మహిళల -52 కేజీల విభాగంలో కోకిల ఫైనల్‌కు దూసుకెళ్లి భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. ఫైరింగ్ రేంజ్‌లో, భారత పారా మహిళా షూటర్లు అవనీ లేఖరా, మోనా అగర్వాల్‌లు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ రెండింటిలోనూ స్థానాలు దక్కించుకుని సత్తా చాటారు. మరోవైపు పురుషుల ఫైన‌ల్స్‌లో స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంతో పతకం అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 

ఇక ఆసియా పారా క్రీడలు ఆదివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. పారాలింపిక్‌ పతక విజేత సిమ్రన్‌ శర్మ, ప్రముఖ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ త్రివర్ణ పతాకధారులుగా ముందు నడవగా... వారి వెంట భారత పారా అథ్లెట్ల బృందం ఆరంభ వేడుకల్లో పాల్గొంది. మన అథ్లెట్లు భారత ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక దుస్తువుల్లో మెరిశారు. 

ఈ క్రీడల్లో భారత్‌ నుంచి 168 మంది అథ్లెట్లు 11 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. 2023లో హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారతదేశం అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. రికార్డు స్థాయిలో 111 పతకాలు (29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు) సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement