para archery
-
పోరాటానికి పరిమితులెందుకు?
ఎవరైనా, ఎక్కడైనా పతకాల వేటలో పడి... గెలిస్తే సరి ఇలా కష్టపడ్డాను. జీవితాన్నే ధారపోశాను అన్నట్లు చెబుతారు. అదే ఓడిపోతే మాత్రం వెంటనే వచ్చే నోటి మాట సరైన మౌలిక వసతులు లేవని, సమాఖ్యలోని రాజకీయాలే ఆటగాళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నాయని! అన్నీ ఉండి అనే వాళ్ల తూటా మాటలివి. కానీ శీతల్ దేవి అలా కాదు. గురిపెట్టేందుకు కళ్లున్నా... విల్లును పట్టుకునేందుకు, బాణం లాగడానికి చేతి వేళ్లు కాదు కదా... అసలు చేతులే లేవు. అయినా సరే గురిపెట్టింది లక్ష్యంపై! ఉన్న రెండు కాళ్లతో విల్లును సరిచేసుకుంటుంది. కాలి వేళ్లతో బాణాన్ని సంధిస్తుంది. 2022 నుంచి అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలు గెలిచింది. తాజాగా ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్ (2025) అవార్డే ఆమెను వరించేలా ఎదిగింది.అందరూ పతకం కోసం ఆశపడతారు. కానీ ‘పతకమే’ ఆమె ప్రతిభకు దాసోహమంటుంది. ఈ పోటీల్లో కొందరు గెలుస్తారు. కానీ ఆమె బరిలోకి దిగితే ఆ‘పోటీ’నే మురుస్తుంది. మరికొందరేమో పోరాడి ఓడినా తమ ప్రదర్శనతో తృప్తి చెందుతారు. కానీ ఆమె పోరు... ఆడే తీరు...చూసి ఆ ప్రదర్శనకే వన్నెతెస్తుంది. ఆమెనే కశ్మీరీ పారా ఆర్చర్ శీతల్ దేవి. చేతులు ముడుచుకొని తీరిగ్గా కాలక్షేపం చేసే దేశంలో చేతుల్లేని శీతల్ ఏ దేశమేగినా... ఏ ఈవెంట్లో కాలిడినా భారతావని పొగిడే పతకం తెస్తోంది. కొన్నేళ్లుగా పతకాల పనిపట్టిన 19 ఏళ్ల టీనేజర్‌ను తాజాగా ‘వరల్డ్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డే పట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె విజయవంతమైన పయనంపై చెప్పిన సంగతులివి... చాలా ప్రత్యేకం... చిరస్మరణీయం.. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా నామినేట్ అవడమే సాఫల్యమనుకుంటే... ఏకంగా పురస్కారాన్నే గెలుపొందడం చిరస్మరణీయంగా మార్చింది. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకమైందంటాను. ఎదురైన ప్రతీ ఎదురుదెబ్బకు నిలిచి నేను పడిన కఠోర శ్రమకు, త్యాగానికి ఈ అవార్డు ప్రతిబింబం. పతకాల కోసం పాటుపడితే అవార్డే వచ్చింది. ఈ ప్రదర్శనలో నా తల్లిదండ్రులు, కోచ్ నా వెన్నంటే నిలిచారు. వారి అండదండలే ఈ పురస్కారానికి కారణం. మీకు పరిమితులు పెట్టెదెవరు?పరిధి, పరిమితులు ఉండాలి. కానీ ప్రతి దానికి ఉండనక్కర్లేదు. ముఖ్యంగా మనకు, మన ఎదుగుదలకు, సాఫల్యానికి పరిమితులెందుకు? అందుకే అంటాను... మీ పరిమితులను నిర్ణయించే అధికారం ఇంకెవరికీ ఇవ్వకండి. మీరేంటో మీకు బాగా తెలుసు. మీరేం చేయగలరో కూడా మీకే తెలుసు. ఇన్ని తెలిసిన మీకు పరిమితులు ఎవరో విధించే అవకాశం ఎప్పటికీ ఇవ్వకూడదు. అలాంటప్పుడే మనం విజయవంతమవుతాం గుర్తుంచుకోండి. ఉదయం మొదలుపెడితే... నా శిక్షణ ప్రతీ రోజు ఉదయం 8 గంటలకే మొదలవుతుంది. సాయంత్రం 6 అయితేగానీ ముగిసిపోదు. మధ్యలో రెండు గంటలు మాత్రం తినడానికి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బ్రేక్ ఇస్తాను. నాకిది రొటీన్. సుదీర్ఘ సమయం నేను ఎంచుకున్న ‘రేంజ్’పైనే దృష్టి పెడతాను. అస్తమానం బాణాలే సంధిస్తూ కూర్చోను. శారీరక ఫిట్నెస్, మానసిక స్థైర్యం పెరిగేందుకు కూడా కసరత్తు చేస్తాను. సాంకేతికంగా మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తాను. గతేడాది అలా చేయడం వల్లే నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోగలిగాను.శీతల్ పతకాలివి...శీతల్ పతకాల వేట 15 ఏళ్లకే ప్రారంభమైంది. అది కూడా ప్రతిష్టాత్మక ఆసియా పారా క్రీడల్లో..! హాంగ్జౌ (చైనా)లో జరిగిన 2022 మెగా ఈవెంట్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు నెగ్గిన శీతల్ డబుల్స్‌లో రజతాన్ని గెలుచుకుంది. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిసింది. ఆసియా చాంపియన్‌షిప్ (బ్యాంకాక్)లో స్వర్ణం, రజతం సాధించింది. 2024 పారిస్‌లో జరిగిన పారలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్‌లో కాంస్యం చేజిక్కించుకుంది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ (కొరియా) లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచింది. -
ప్రతిభకు పురస్కారం
లుసానే: భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు శీతల్ దేవికి దక్కింది. గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్... వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్‌కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ టీమ్‌లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్నిచి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్ దేవి భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో రజతం, 2023 ఆసియా చాంపియన్íÙప్లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
శీతల్ దేవికి వైఎస్ జగన్ అభినందనలు
ఆసియాకప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా అర్చర్ శీతల్ దేవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్‌గా నిలిచిన శీతల్‌కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్‌లో పాల్గోనున్న ఆమెకు ఆల్‌ది బెస్ట్" అంటూ ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.A highly inspiring achievement! My heartiest congratulations to @archersheetal on this historic milestone of being the first Indian Para Archer to Qualify for Able-Bodied International event.Your journey is a shining example of what dedication and belief can achieve.We are… https://t.co/oSrtHVgdmW— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 చరిత్ర సృష్టించిన శీతల్..శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్‌ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2024 పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది. -
పారా ఆర్చరీని దాటి ప్రధాన జట్టులోకి...
న్యూఢిల్లీ: రెండు చేతులు లేకుండానే బరిలోకి దిగి పారా ఆర్చరీలో సంచలన విజయాలు సాధించిన శీతల్ దేవి ఇప్పుడు ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది.సోనీపథ్లో నాలుగు రోజుల పాటు 60 మంది పోటీ పడిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని శీతల్ క్వాలిఫై కావడం విశేషం. ‘నేను ఆర్చరీ మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక రోజు అందరిలాగే ఓపెన్ (ఏబుల్డ్) పోటీల్లో పాల్గొనాలని కలలుగన్నా. గతంలో ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు. కానీ లోపాలు సరిదిద్దుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. ఇప్పుడు ఇలా అవకాశం దక్కింది’ అని శీతల్ వ్యాఖ్యానించింది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జూనియర్ జట్టులో మహిళల రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండపావులూరి యుక్తశ్రీ కూడా ఎంపికైంది. -
గురి తప్పని బాణం
స్ఫూర్తిదాయకమైన విజేతలు, సామాన్యులలో అసామాన్యుల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి పారాలింపిక్ అథ్లెట్ శీతల్దేవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో శీతల్‌దేవి చారిత్రాత్మకమైన బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.పుట్టుకతోనే రెండు చేతులు లేక పోయినా సంకల్పబలాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు శీతల్. ఆ బలమే తనను స్ఫూర్తిదాయకమైన విజేతను చేసింది. ‘శీతల్, నువ్వెప్పుడూ వరల్డ్ ఛాంపియన్‌వే. ప్రజల మనసులను గెలుచుకోవడంలో కూడా నువ్వు ఛాంపియన్వి’ అని శీతల్‌దేవిని ఆకాశానికెత్తారు మహీంద్రా. గత సంవత్సరం ఒక బాణాన్ని ఆనంద్‌కు బహూకరించింది శీతల్. ‘నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన బాణం నా కుటుంబంలో విలువైన వారసత్వ సంపదగా నిలిచి పోతుంది. నీలాగే ధైర్యంగా ఉండడానికి మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది’ అని రాశారు. శీతల్దేవితో తాను ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. -
వరల్డ్ చాంపియన్.. శీతల్ దేవి సరికొత్త చరిత్ర
భారత పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్ (Para World Archery Championship)లో భాగంగా మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో సంచలన విజయం సాధించింది. వరల్డ్ నంబర్ వన్, టర్కీకి చెందిన ఓజ్నుర్ క్యూర్ గిర్డీని 146- 143 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Won Gold Medal) కైవసం చేసుకుంది.పద్దెమినిదేళ్ల వయసులోనేదక్షిణ కొరియాలోని గ్వాన్జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ మేరకు శీతల్ దేవి పసిడి గెలిచింది. తద్వారా ఈ చాంపియన్‌షిప్‌లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్‌గా ఆమె చరిత్రకెక్కింది. అంతేకాదు పద్దెమినిదేళ్ల వయసులోనే శీతల్ ఈ ఘనత సాధించడం విశేషం.అంతకు ముందు.. తోమన్ కుమార్‌తో కలిసి ఇదే ఈవెంట్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి కాంస్యం గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్హామ్- నాథన్ మాక్క్వీన్ను 152- 149తో ఓడించి ఈ పతకం సాధించింది శీతల్- తోమన్ జోడీ.అదే విధంగా.. మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్ దేవి సరితతో కలిసి రజత పతకం సాధించింది. ఫైనల్లో టర్కీ పారా ఆర్చర్ల చేతిలో ఓడిపోవడం ద్వారా వీరు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.రెండు చేతులు లేకుండానేజమ్ము కశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి పుట్టడమే ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల రెండు చేతులు లేకుండానే జన్మించింది. అయినా విధివంచితురాలినని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణం ప్రయోగించడం నేర్చుకుంది. అంచెలంచెలుగా ఎదిగి 2024లో పారిస్ పారా ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది. సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటిది చేతులే లేకుండా శీతల్ వేది బాణం వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నో పతకాలు గెలుచుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా వరల్డ్ చాంపియన్ అయింది.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’ -
ఏడు నెలల గర్భిణి.. అమ్మగా.. అథ్లెట్‌గా..
ఆమె ఒక అమ్మ. పైగా ఏడు నెలల గర్భవతి! అయితేనేం పారిస్‌లో ఆర్చర్‌గా పారాలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టింది. ఇంట్లో ఓ కంట రెండేళ్ల బాలుడి ఆలనాపాలన చూస్తోంది. మరో కంట రెండు నెలల్లో కళ్లు తెరిచే గర్భస్థ శిశువుని కనిపెడుతోంది. అలాగని రెండు పాత్రలతోనే సరిపెట్టుకోలేదు. ఆర్చరీలో లక్ష్యంపై బాణాలు కూడా సంధిస్తోంది.వైకల్యాన్నే చిన్నబోయేలా చేసిందిఅలా బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హమ్ త్రిపాత్రాభినయానికి సమన్యాయం చేస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ ర్యాంకింగ్ రౌండ్లో జోడీ గ్రిన్‌హమ్ 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం బ్రిటన్ సహచరుడు నాథన్ మాక్క్విన్తో కలిసి మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకే రోజు ఓ గర్భిణి రెండు ఈవెంట్లతో పాల్గొని వైకల్యాన్నే చిన్నబోయేలా చేసింది.అమ్మను.. పారా అథ్లెట్‌ను కూడాపోటీల అనంతరం ఆమె మాట్లాడుతూ ‘నేను అమ్మను, అలాగే పారా అథ్లెట్‌ను. వీటిలో ఏ ఒక్కటి వదులుకోను. కానీ... ఇంట్లో మాత్రం వందశాతం అమ్మనే’ అని అమ్మతనాన్ని, అథ్లెట్ సామర్థ్యాన్ని వివరించింది. ‘నేను ఇంకా బాగా రాణించగలనని నాకు తెలుసు. ఇంకాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది. అయినా నాలుగో స్థానమేమి నిరాశపర్చలేదు. మిగతా ఈవెంట్లపై మరింత దృష్టి సారించేలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది’ అని తెలిపింది. జోడీ గ్రిన్హమ్కు ఇదేం తొలి పారాలింపిక్స్ కాదు. రియో పారాలింపిక్స్ (2016)లో పాల్గొని మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో రజతం నెగ్గింది. ఇక ఈ పారాలింపిక్స్‌లో ఆమె శని, సోమవారాల్లో పతకాల కోసం రెండు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది.చదవండి: అవని అద్వితీయం -
శీతల్ దేవి శుభారంభం
పారిస్: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్ పేటర్సన్ (బ్రిటన్) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది. అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్నర్ క్యూర్ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్ చాంపియన్íÙప్లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి. సుకాంత్, సుహాస్, తరుణ్ ముందంజ... బ్యాడ్మింటన్ పోటీల్లో తొలి రోజు భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్, తరుణ్ గ్రూప్ దశలో తమ మొదటి రౌండ్లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్ అమీన్ (మలేసియా)పై, సుహాస్ 21–7, 21–5తో హిక్మత్ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్)పై గెలుపొందారు. అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్దీప్ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్ (ఇండోనేసియా) చేతిలో, మన్దీప్ 8–21, 14–21తో మరియమ్ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో నితీశ్ కుమార్–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్ యతిరాజ్–పలక్ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్ క్రాజెస్కీ–జేసీ సైమన్ (అమెరికా) చేతిలో ఓడారు. తైక్వాండో భారత ప్లేయర్ అరుణ తన్వర్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది. -
పారా ఆర్చర్ శీతల్‌కు స్వర్ణం, రజతం
ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది. రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి ‘షూట్ ఆఫ్’లో సింగపూర్ ప్లేయర్ నూర్ సియాదా చేతిలో ఓడిపోయింది. -
రేపటి నుంచి జాతీయ ఆర్చరీ
ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు ∙పారా ఆర్చరీ కూడా సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు నగరం వేదిక కానుంది. రేపటినుంచి రెండు రోజుల పాటు ఆర్ఆర్సీ గ్రౌండ్స్‌లో ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జాతీయ ఆర్చరీ టోర్నీ జరుగుతుండటం విశేషం. గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ టోర్నీ వివరాలు వెల్లడించారు. బాంబూ విల్లుతో సాగే ఈ పోటీల్లో గ్రామీణ ప్రతిభను గుర్తించడమే తమ లక్ష్యమని భారత ఆర్చరీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కామినేని వెల్లడించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే నగరంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ప్రతిభాన్వేషణ కార్యక్రమం ద్వారానే పలువురు ఆర్చర్లు వెలుగులోకి వచ్చి నట్లు అనిల్ వివరించారు. దీనికి సమాంతరంగా జాతీయ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్ కూడా నిర్వహిస్తారు. ఇందులో రికర్వ్, కాం పౌండ్ విభాగాల్లో ఆర్చర్లు తలపడతారు. పారా విభాగంలో 75 మందికి పైగా ఆర్చర్లు పోటీలో నిలిచారు. పారా విభాగంలో జాతీయ స్థాయిలో పోటీలు జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం కార్యదర్శి ఉపాధ్యక్షుడు టి.రాజు, కోశాధికారి శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి అరవింద్ కూడా పాల్గొన్నారు.


