ఆసియాకప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా అర్చర్ శీతల్ దేవికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
"శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్‌గా నిలిచిన శీతల్‌కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్‌లో పాల్గోనున్న ఆమెకు ఆల్‌ది బెస్ట్" అంటూ ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.
A highly inspiring achievement! My heartiest congratulations to @archersheetal on this historic milestone of being the first Indian Para Archer to Qualify for Able-Bodied International event.
Your journey is a shining example of what dedication and belief can achieve.
We are… https://t.co/oSrtHVgdmW— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025
చరిత్ర సృష్టించిన శీతల్..
శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్‌ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
2024 పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది.


