సాక్షి, తాడేపల్లి: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/CPgKs65Lbt
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 2025

1947 జులై 4వ తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో జన్మించిన వంగవీటి మోహన రంగా.. కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే పేద ప్రజల తరఫున పోరాడేవారు. ఆ ఆదరణతో.. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. 1988 డిసెంబర్ 26న ఆయన విజయవాడలో దారుణహత్యకు గురయయారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా భావిస్తుంటారు.


